This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) వలన ప్రెగ్నెంట్ అయ్యే చాన్సెస్ ఏమిటి?

Conception
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) వలన ప్రెగ్నెంట్ అయ్యే చాన్సెస్ ఏమిటి?
Likes3 Likes|
Read time6 min

మెటా డెస్క్రిప్షన్: ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) అనేది ఒక కామన్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. గర్భధారణ కోసం దీన్ని చేస్తారు. ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఈ ఆర్టికల్​ను చదవండి.

ఇంట్రొడక్షన్ (Introduction to IUI in telugu)

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) అనేది గర్భం దాల్చేందుకు ఉపయోగపడే సంతానోత్పత్తి చికిత్స. ఇది ఒక రకమైన కృతిమ గర్భధారణ. ఈ పద్ధతిలో నేరుగా గర్భాశయంలో స్పెర్మ్​ను ప్రవేశపెడతారు.

IUI అనేది సాధారణంగా ఇతర సంతానోత్పత్తి చికిత్సల కంటే చాలా సమర్ధవంతంగా ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో గర్భం దాల్చని జంటలకు ఈ పద్ధతి మొదట సిఫారసు చేయబడుతుంది. IUI పద్ధతి ద్వారా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది.

వయసు: IUI విజయవంతమయ్యే అవకాశం పెద్ద వారి కంటే యువతలో ఎక్కువ ఉంటుంది. యువకుల నుంచి వచ్చే స్పెర్మ్ అండాన్ని (గుడ్డును) ఫలదీకరణం చేసేందుకు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మునుపటి గర్భాలు: గతంలో విజయవంతమైన గర్భాలు IUI ద్వారా ప్రెగ్నెన్సీ పూర్తి సమయం ఉండేందుకు సహాయపడుతుంది.

మగవారి సంతానోత్పత్తి: స్పెర్మ్ యొక్క చలన శక్తి తక్కువగా ఉన్న సందర్భాల్లో IUI విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ట్యూబ్స్ నిరోధించబడినా లేదా ఇతర సంతానోత్పత్తి సమస్యలు ఉన్నా కాని IUI విజయవంతమవడంపై ప్రభావం చూపుతాయి.

IUI ద్వారా గర్భధారణ అవకాశాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నప్పటికీ, కొన్ని మార్గదర్శకాలు పాటించడం మరియు వైద్యుడి సహాయం తీసుకోవడం ద్వారా చికిత్స సమయంలో తలెత్తే సమస్యలను అధిగమించొచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ఇంట్రాయుటరైన్ ఇన్సెప్షన్ (IUI) పద్ధతి కోసం స్పెర్మ్ ఎలా పొందాలి?

IVF vs IUI: ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? (Differences between IVF and IUI in telugu)

IUI మరియు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) రెండూ కూడా జంటలు గర్భం దాల్చేందుకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ, ఈ రెండు పద్ధతుల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం..

1. ధర: IVF సైకిల్​ IUI సైకిల్ కంటే చాలా ఖరీదైనది.

2. విజయావకాశాల శాతం: IVF విజయాల శాతం IUI విజయాల శాతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

3. పద్ధతి: IVF పద్ధతి అనేది IUI పద్ధతి కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: IUI(ఇంట్రా యుటెరైన్ సెమినేషన్)తో గర్భవతి కావడానికి ఎంత సమయం పడుతుంది

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) ఎవరికి సహాయం చేస్తుంది? (IUI helps to whom in telugu )

ఓవ్యూలేషన్ (అండోత్సర్గము) ఇండక్షన్, లేదా సహకారక సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా ప్రెగ్నెంట్ కాని వారికి IUI పద్ధతి చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. IUI పద్ధతిని వివరించలేని ఇన్​ఫెర్టిలిటీ, మేల్ ఇన్​ఫెర్టిలిటీ, లేదా ఫీమేల్ ఇన్​ఫెర్టిలిటీ సమస్యలు ఉన్న జంటలు ఉపయోగిస్తారు.

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) ఎలా పని చేస్తుంది? (How IUI works in telugu)

IUI అనేది నేరుగా గర్భాశయంలోకి స్పెర్మ్​ను ఇంజెక్ట్ చేసే సంతానోత్పత్తి చికిత్స. ఏ జంటలలో అయితే స్పెర్మ్ అనేది స్త్రీ గర్భాశయ ముఖద్వారం ద్వారా ఇంకా గర్భాశయంలో నుండి వెళ్ళి అండాన్ని ఫలదీకణం చెందించలేకపోతోందో వారికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు.

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) ద్వారా వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి? (Side effects of IUI in telugu)

IUI ద్వారా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. స్పెర్మ్ ఇంజెక్షన్ సమయంలో (నొప్పి రావడం, స్రావం, లేదా రక్త స్రావం) వంటివి జరుగుతాయి. ఫెర్టిలిటీ సమస్యలు (తక్కువ అండాల ఉత్పత్తి) ఇంకా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సాధించడంలో ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) ఎంతవరకు విజయవంతమైంది? (How much IUI is successful in conceiving)

IUI విజయాల శాతం అనేది వివిధ కారకాల మీద ఆధారపడి ఉంటుంది. జంట యొక్క రోగ నిర్ధారణ అనేది IUI విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది.

● వివరించలేని ఫెర్టిలిటీ కేసుల విషయంలో IUI విజయాల శాతం సైకిల్​కు 7% and 10% మధ్య ఉంటుంది.

● మేల్ ఇన్​ఫెర్టిలిటీ కేసుల విషయంలో IUI విజయాల శాతం 16.9% గా ఉంది.

● సింగిల్ ఓపెన్ ఫెర్టిలిటీ ట్యూబ్ కేసులలో (అంటే ఒక ఫాలోపియన్ ట్యూబ్ నిరోధించబడితే) IUI విజయవంతమయ్యే అవకాశం 11.7 and 38.1% శాతం మధ్య ఉంటుంది. ట్యూబ్ ఎక్కడ నిరోధించబడిందో దానిపై ఆధారపడి ఉంటుంది..

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) కి ఎంత ధర అవుతుంది?

IUIకి ఒకే విధమైన ఫీజు ఉండదు. ధర అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్, క్లీనిక్ ఉన్న ఏరియాను బట్టి దాని ధర ఉంటుంది.

ఒక IUI సైకిల్ ధర సుమారుగా INR 6,000 వరకు ఉంటుంది. చికిత్స ముందు ఇచ్చే మందులు మరియు చికిత్స తరువాత ఇచ్చే మందుల ధర సుమారుగా INR 4,000 to INR 5,000 వరకు ఉంటుంది. అందుకోసం, ఒక్క సైకిల్ IUI కి సుమారు INR 12,000 to INR 17,000 వరకు ఖర్చవుతుంది. (మందులతో కలుపుకుని) ఓవ్యూలేషన్ పర్యవేక్షణ మరియు ఇతర అవసరమైన పద్ధతులు ఇంకా మందులను కలిగి ఉంటుంది.

ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) ప్రక్రియ సమయంలో ఏం ఆశించాలి? (What to expect in IUI telugu)

IUI చికిత్స సమయంలో, వైద్యుడు యోనిలోకి స్పెక్యులమ్​ను చొప్పిస్తాడు. స్పెర్మ్ ని ఒక సౌకర్యవంతమైన ట్యూబ్ నమూనా ద్వారా గర్భాశయం యోనిలోకి, మరియు గర్భాశయ ముఖద్వారం నుండి గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. ఇందుకోసం ఒక ట్యూబ్​ను ఉపయోగిస్తారు. స్పెర్మ్ ని ఆ ట్యూబ్ నుండి నేరుగా గర్భాశయంలోకి పంపించాడుతుంది. ఇది అండం ఫలదీకరణం చెందేందుకు సహాయపడుతుంది. తర్వాత ట్యూబ్ మరియు స్పెక్యులమ్లు తొలగించడబడుతాయి.

ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 20 నిమిషాల 20 minutes సమయం పడుతుంది. ధృవీకరించిన డాక్టర్ క్లీనిక్​లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాడు. ట్యూబ్ చొప్పించే సమయంలో కొంత మంది పేషంట్స్ అసౌకర్యానికి గురవుతారు.

కొంత మందికి చికిత్స సమయంలో నొప్పి, ఉత్సర్గ (స్రావం), లేదా రక్తస్రావం వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఏదేమైనా ఇవి తేలికపాటివి మరియు చికిత్స తర్వాత కొన్ని రోజులకు పరిష్కరించబడతాయి.

ముగింపు..

గర్భం దాల్చేందుకు ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) సురక్షితమైన పద్ధతి అయినప్పటికీ, సరైన ఫలితాలు వచ్చేందుకు సరైన మందులు వాడుతూ.. సరైన పద్ధతులు అనుసరించడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మీ మెడికల్ హిస్టరీని అర్థం చేసుకునే నమ్మకమైన వైద్యుడిని కలవండి.

Tags

IUI in telugu, What is IUI in telugu, Can I conceive through IUI in telugu, Babies born through IUI are normal in telugu, benefits of IUI in telugu, IUI treatment in telugu

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.